రైలులో జవాను ఘాతుకం

విజయవాడ: అలెప్పీనుంచి బొకారో వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో గత అర్థరాత్రి 12 గంటల సమయంలో మిలిటరీకి చెందిన ఓ జవాను బోగీలోని ఓ బాలికపట్ల అస్యభ్యంగా ప్రవర్తించాడు. సహా ప్రయాణీకులు టీసీకి సమాచారం అందించటంతో బోగీలో ఉన్న  భద్రతాసిబ్బంది జవానును అదుపులోకి తీసుకుని రైలు విజయవాడకు చేరుకోగానే పోలీసులకు అప్పగించారు. బాలిక, సంబంధీకులు తాడేపల్లిగూడెంకు చెందినవారు.