రొండ మల్లారెడ్డి ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

శామీర్ పేట్, జనం సాక్షి :
మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామానికి చెందిన రొండ మల్లారెడ్డి సమాజ సేవను గుర్తించి ఆసియా వేదిక కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రకటించి,తమిళనాడు ప్రభుత్వం చేత రొండ మల్లారెడ్డికి గౌరవ డాక్టరేట్ అవార్డు అందజేశారు. ఈ రోజు తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రొండ మల్లారెడ్డిని కలిసి శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.జైపాల్ రెడ్డి ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వి.మురళి గౌడ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ యాదవ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షులు పి.లక్ష్మినారాయణ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు పి.ధర్మారెడ్డి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు జి.మోహన్ రెడ్డి ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి టి.మురళి గౌడ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి టి.దర్శన్ గౌడ్ ,హకీంపేట్ 9 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యన్.మల్లేష్ గౌడ్ హకీంపేట్ 9 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఏ.రవీందర్ గౌడ్ ,కాంగ్రెస్ నాయకులు కె.సుధాకర్ రెడ్డి ,యూత్ కాంగ్రెస్ నాయకులు యన్.రాకేష్ లు పాల్గొన్నారు.
23ఎస్పీటీ -2: మల్లారెడ్డిని సన్మానిస్తున్న నాయకులు