లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు అందజేసిన మంత్రి పువ్వాడ, విప్ రేగా

బూర్గంపహాడ్ ఆసరా పింఛన్ లబ్ధిదారులతో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని కొత్తగూడెం క్లబ్ లో కొత్త ఆసరా పింఛన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చేతుల మీదుగా పెన్షన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూర్గంపహడ్ ఆసరా ఫించన్ల లబ్ధిదారులతో స్థానిక జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ బూర్గంపహడ్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, బాలి శ్రీహరి, నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మి రెడ్డి, యడమకంటి సుధాకర్ రెడ్డి, తిరుపతి ఏసుబు, సాజిద్, గుల్ మహమ్మద్, సాలయ్య, బుపెళ్లి నరసింహరావు, బెజ్జంకి కనకాచారి, షౌకత్, వీరయ్య, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.