లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. ఉదయం వాయిదా అట్టుడికింది. ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు తమ డిమాండ్‌ను కొనసాగించాయి. సభ్యులు తమ పట్టును వీడక సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు ఇదే అంశంపై అటు రాజ్యసభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.