లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన కొనసాగుతోంది. ఉదయం ఓసారి వాయిదాపడిన లోక్‌సభ తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ వ్యక్తం చేశాయి. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.



