వంతెనపైనుండి లారీ బోల్తా.. ఇద్దరు మృతి

విజయనగరం, జూలై 21 : జిల్లాలోని డెంకాడ మండలం నాటవలస వంతెనపైనుండి శనివారం తెల్లవారు జామున లారీ బోల్తా పడిన సంఘటనలో ఇరువురు మృతి చెందారు. జంషెడ్‌పూర్‌ నుండి విశాఖ వెళ్తున్న విజయవాడకు చెందిన లారీ తెల్లవారు జామున అదుపుతప్పి వంతెనపైనుండి పడడంతో డ్రైవర్‌ వర్మరాజు, క్లీనర్‌ మల్లేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను బయటికి తీయించి విజయనగరం కేంద్ర ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.