‘వంశధార’పై సర్వే
గ్రామీణ భామిని, శ్రీకాకుళం: వంవధారపై నిర్మించ తల పెట్టిన నేరడి బ్యారేజి వల్ల ఎదురయ్యే పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. ట్రిబ్యునల్ ఛైర్మన్ ముకుందకం శర్మ ఆదేశాల మేరకు ఆంధ్రా, ఒడిశా ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. వంశధార నది తాజా పరిస్థితి, నది లోతు, మారిన గమనం వంటి అంశాలపై టోటల్ స్టేషన్ , ఆటో లెవెల్ వంటి యంత్ర పరికరాలతో సమగ్రంగా సర్వే చేస్తున్నారు. బ్యారేజి నిర్మించే ప్రాంతానికి ఎగువన 15కి. మీ, దిగువన 10కి. మీల వరకు సర్వే చేస్తామని అధికారులు తెలిపారు. సీడబ్యూసీ సబ్ డివిజినల్ ఇంజినీరు బీవీ సతుపత్తి , డీసీ ప్రసాద్, వంశధార ఈఈ రాంబాబు , ఒడిశా ఇరిగేషన్ ఈఈ దినేష్ చంద్రదాన్ తదితరుల ఆధ్వర్యంలో ఈ సర్వే చేస్తున్నారు.


