వనపర్తి గ్రామంలో విషజ్వరంతో మహిళ మృతి

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని వనపర్తి గ్రామంలో డెక్కం లక్ష్మి అనే మహిళ వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందినది. లక్షికి స్థానికంగా చికిత్స చేయించినా తగ్గలేదు, ఈమె భర్త లచ్చయ్య 2సం|| క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించటంతో ఇద్దరు ఆడ పిల్లలు అనాధలయ్యారు.