వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొయ్యూరు ఎస్ఐ 2 ప్రశాంత్
మల్హర్, జనంసాక్షి
అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు ఎస్ఐ 2 ప్రశాంత్ అన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని  మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లను ఖాళీ చేయాలని అలాగే పశువుల కాపర్లు వాగులు వంకల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  కల్వర్టులు, రోడ్లపై నీటి ప్రవాహం ఉండగా దాటవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని సూచించారు.