వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి.

వినతి పత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి)
జిల్లా సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తిష్ట వేశాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బెల్లంపల్లి పర్యటనకు వచ్చిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రజాతంత్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. గురుకులాల్లో, కస్తూర్బా పాఠశాలల్లో సరైన భోజనం పెట్టక పోవడంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు చనిపోయిన ఉదంతాలను వినతి పత్రంలో వివరించినట్లు ప్రజాతంత్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు అంబాల మహేందర్ తెలిపారు.