వాటర్‌ ప్లాంటును సీజ్‌ చేయాలి

నెల్లికుదురు, జూన్‌ 6
మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్‌ వేసి వాటర్‌ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను సీజ్‌ చేయాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కారుపోతుల చంద్రమౌళి గౌడ్‌ సంబంధిత అధి కారులను డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ వాటర్‌ ప్లాంటు నుంచి ఉత్పత్తి చేసే తాగునీరు కలుషి తంగా ఉంటుందని దీంతో ప్రజలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తక్షణ మే బోరుతో సహా ప్లాంటును మూసివేసే విధం గా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు