వికలాంగుల సంక్షేమానికి రూ.45కోట్లు కేటాయించాలి
హైదరాబాద్: వికలాంగుల న్యాయమైన హక్కుల సధన కోసం ఎమ్మార్పీఎస్ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్ – మలక్‌పేట, నల్గొండ క్రాస్ రోడ్డులో మూడు రోజుల దీక్ష చేపట్టారు. దీక్షకు వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వికలాంగుల పింఛనును రూ.500 నుంచి రూ.1500కు పెంచాలని, రాష్ట్ర బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి రూ.4500కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వుద్యమాన్ని మరింత వుద్దృతం చేస్తామని హెచ్చరించారు.



