విజయమ్మ నివాసంలో కవిత
హైదరాబాద్: శాసనసభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లోటాస్‌పాండ్‌లోని వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో కలిశారు. ఈ నెల 17నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల మద్దతు కోరుతున్నట్లు కవిత తెలిపారు.



