విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 29 న చలో కలెక్టరేట్

జహీరాబాద్ ఆగస్టు 27 (జనంసాక్షి)విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డిలో 23 ప్రారంభమైన అధ్యయన జీపు జాత శనివారం జహీరాబాద్ పట్టణంలో ముగింపు సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి హాజరై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు ఇప్పటివరకు విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ గాక పై చదువులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలో హాస్టల్ లో సర్వే చేయడంతో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినవి హాస్టల్ విద్యార్థులకు ఇప్పటివరకు నోట్ బుక్స్ పెట్టెలు గ్లాసులు కటోరి ప్లేట్స్ ఇవ్వలేరని అన్నారు బీసీ గురుకుల సంక్షేమ హాస్టల్లో భోజనం బాగాలేక ఫుడ్ పాయిజన్ అయింది దీంతో ఎస్ఎఫ్ఐ బృందం పై అధికారులతో మాట్లాడి విద్యార్థులకు హాస్పిటల్ కి పంపించి వారిని సస్పెండ్ చేయించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు మంచి భోజనం అందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని పెరిగిన ధరలకు అనుకూలంగా హాస్టల్ విద్యార్థులకుమెస్ మరియు కాస్మోని ఇచ్చార్జీలు పెంచాలని అన్నారు ప్రభుత్వ విద్యాసంస్థలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ వర్కర్ పోస్టులు భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థులను బాల కార్మికులుగా మారుస్తూ కుల వృత్తులను తీసుకొచ్చి కులాలకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందనిp నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వకుండా అగ్ని వీర్ తీసుకొచ్చి ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల నిరుద్యోగుల పట్ల మొండి వైఖరి నశించి విద్యారంగం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని లేనియెడల ఉద్యమాలు ఉదృతం చేస్తామని అన్నారు రేపు 29 నాడు జరిగే చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని అన్నారు..ఈ సభలో ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు మైపాల్ జెవివి జిల్లా గౌరవ అధ్యక్షులు శివ బాబు జిల్లా అధ్యక్షులు ప్రతాప్ జిల్లా అధ్యక్షులు సందీప్ ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ రమ్య సాక్షి సహయ కార్యదర్శులు రజినీకాంత్ రాజేష్ జిల్లా కమిటీ సభ్యులురవికుమార్ దుర్గాప్రసాద్ సాయి చంద్ర వర్ధన్ మల్లేష్ అతీక్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.