విద్యార్థులతో పనిచేయించడం నేరం

గుంటూరు, జూలై 18: 14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయిస్తే నేరమని, అటువంటి వారిపై కేసులు పెడతామని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన ముప్పాళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం విద్యా వనరుల కేంద్రాన్ని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ మాట్లాడుతూ, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అభివృద్ధి చెందిన మండలమైన ముప్పాళ్లలో 60 శాతం అక్షరాస్యత ఉండటం విచాకరమన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే పథకాల పైతల్లి తండ్రులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ముగ్గురికి ట్రై సైకిళ్ళు, 10 మందికి ఎస్‌కార్ట్‌ ఎలవెన్స్‌ కింద 4,500 రూపాయలు, 6 మందికి ఇయరింగ్‌ మిషన్లను, వీల్‌ ఛైర్‌ అందించారు. అనంతరం ముప్పాళ్ల వైద్యశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వైద్యశాలలో అని రకాల మందులను అందుబాటులో ఉండాలన్నారు. జెసి శారదాదేవి, ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, ఆంజనేయులు, సిఎంవో రాజకుమారి, తహశీల్దార్‌ సూర్య తదితరులు ఉన్నారు.