విద్యార్థులు దేశాభిమానాన్ని చాటుకోవాలి-డాక్టర్ పి పద్మ వెల్లడి
విద్యార్థులు దేశాభిమానాన్ని చాటుకోవాలి-డాక్టర్ పి పద్మ వెల్లడి
ఇల్లందు అక్టోబర్ 12 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ టి. రాజు ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అమృత్ కలశ యాత్ర, మేరీమట్టి మేర దేశ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల బోధన , బోధనేతర సిబ్బంది, చదువుతున్న విద్యార్థులు తమ నివాస గృహాల సమీపం నుండి సేకరించిన మట్టిని దేశం పట్ల గల తమ అభిమానాన్ని చాటుతూ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ నుండి మొదలైన మట్టి సేకరణ కార్యక్రమం ప్రతి విభాగంలోని అధ్యాపకుల నుండి, విద్యార్థుల నుండి మట్టిని సేకరిస్తూ ఆ మట్టిని కళాశాల ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు తీసుకువచ్చి అక్కడ ఒక మొక్కను నాటిన అనంతరం ఆ మొక్కకు ఉపయోగించి తర్వాత పంచ ప్రాణ ప్రతిజ్ఞను అందరు చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పోలారపు పద్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ ప్రాంతాల నుండి మట్టిని తీసుకురావడం అనేది విద్యార్థుల యొక్క దేశభక్తికి నిదర్శనమని జీవితంలో ప్రతి ఒక్కరికి దేశం పట్ల గౌరవం, అభిమానం, సేవా దృక్పథం, త్యాగం వంటి విషయాలను పునికి పుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వాహకులు టి.రాజు, వైస్ ప్రిన్సిపల్ బిందు శ్రీ , అకడమిక్ కోఆర్డినేటర్ జి.శేఖర్, బి. చెంచురత్నయ్య, డాక్టర్ రమేష్ ఎస్. ఇంద్రాణి, పి శారద, బి. సరిత , ఎస్ సురేందర్ ఎస్. ఈశ్వర్ ఎం. రాజు, డి. వెంకటేశ్వర్లు , టి. శ్రీకాంత్, పి. లక్ష్మణరావు, వై. సుజాత తదితరులు పాల్గొన్నారు