విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రారతాల నుంచి వచ్చిన వందలాది మంది ఉపాధ్యాయులు ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి  వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే  ఉద్థృతం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.