విద్యుత్తు సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యుత్తు కోతలపై అమాత్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకమైన విషయం తెలిసిందే. ఇది మీడియాకు లీక్‌ కావడంతో ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళికలో లేకున్నా…. సచివాలయానికి రాగానే  అందుబాటులో ఉన్న అధికారులతో విద్యుత్తు సమస్యపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అందుకు తగ్గ రీతిలోనే రైతులకు ఏడుగంటల విద్యుత్‌ అందేలా చూడాలని సీఎం ఆదేశించినట్లు గత అనేక సమీక్షల్లో ఇచ్చిన అంశాన్నే ప్రకటన రూపంలో ఇచ్చింది. ఇవాళ సీఎం సమీక్షలో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల నెలకొన్న పరిస్థితులు సీఎంకు అధికారులు వెల్లడించినట్లు సీఎంవో  ప్రకటన జారీచేసింది.