విద్యుత్‌సమస్యపై ముగిసిన మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో విద్యుత్‌ సమస్యలపై సాక్షాత్తూ మంత్రులే అగ్రహం, ఆవేదనలు వ్యక్తం చేయడం విశేషం, విద్యుత్‌ కోతల విషయంలో అధికారులపై వారు మండిపడ్డారు. విద్యుత్‌ సమస్యను సమర్ధించుకుంటూ వెళ్తే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని మంత్రులు సీఎంకి చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి డేకే ఆరుణ రూ. 5 లక్షల లోపు రుణాలు తీసుకుని చెల్లించేవారికి వడ్డీ ఉండదని తెలిపారు. 2012-13 సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ. 11,577 కోట్ల రుణాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. సమావేశంలో బోధనా ఫీజులు, ఉపకారవేతనాలపై విద్యుత్‌ సమస్యలపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు మంత్రి డీకే అరుణ చెప్పారు.