విద్య వికాస్ సమితి 33 ఎకరాల స్థలం పేద ప్రజలకు చెందాలి.
విద్య వికాస్ ట్రస్ట్ స్థలం కోసం. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాం.
విద్యా వికాస సమితి ట్రస్ట్ చైర్మన్ శశి ప్రభ. సభ్యులు మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)విద్యా వికాస్ ట్రస్ట్ సమితి 33 ఎకరాలు స్థలం పేద ప్రజలకు చెందాలని మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు గురువారం స్వర్గీయ మాజీ మంత్రి రావు మహారాజ్ 6వ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ డిసిసి చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యా వికాస్ ట్రస్ట్ భూములపై ప్రాణ పోరాటన్నికైన సిద్ధమని వెల్లడించారు.విద్య వికాస్ ట్రస్ట్ సమితి 33 ఎకరాల స్థలంలో ఇంజనీర్ కళాశాల నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని అందుకోసం తన వంతుగా 50 లక్షల విరాళం అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ట్రస్ట్ భూములు అమ్ముతే సహించేది లేదని హెచ్చరించారు.మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్ రావు మహారాజ్ 33 ఎకరాల స్థలాన్ని పేద ప్రజల కోసం కేటాయిం చారని గుర్తు చేశారు ఈ స్థలం పేద ప్రజలకు చెందాలని కోరారు.విద్యా వికాస సమితి ట్రస్ట్ చైర్మన్ శశి ప్రభ మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి మాణిక్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సతీమణి అన్నారు. విద్యా వికాస సమితి ట్రస్ట్ కు చెందిన భూములలో మాణిక్ రావు ఆశయాలకు అనుగుణంగా నర్సింగ్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.33 ఎకరాల స్థలం విద్యా వికాస్ ట్రస్ట్ కు సంబంధిం చినదేనని ఈ భూమి కోసం కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతానని శశి ప్రభ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, రఘవేందర్,ముస్తఫా పటేల్, ముజీబ్, సుభాన్ రెడ్డి, మాణిక్ రావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.