వినాయక మంటపాలకు ఉచిత విద్యుత్
అవసరమైతే మరిన్ని నిధులు
★ మండపాల నిర్వాహకులకు ఇబ్బందులు వద్దు
★ ఎలక్ట్రిసిటీ అధికారులకు 3 లక్షల చెక్కును అందజేత
★ నవరాత్రోత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలి
* రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి ) :
కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాలకు అవసరమైన కరెంట్ కోసం మంత్రి గంగుల కమలాకర్ సొంత నిధులు 3 లక్షల చెక్కును ఎలక్ట్రిసిటీ అధికారులకు అందజేసారు.
మంగళవారం మంత్రి నివాసంలో వినాయక మండపాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలోఎలక్ట్రిసిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతియేటా వినాయక చవితి నవ రాత్రి ఉత్సవాలకు విద్యుత్ బిల్లులు తానే చెల్లిస్తున్నాని గుర్తు చేశారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు సురక్షితమైన ,నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.
వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మండపాల వద్ద సురక్షితమై విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. వినాయక మండప నిర్వాహకులను కరెంటు బిల్ పేరుతో ఇబ్బందులకు గురి చేయద్దని హెచ్చరించారు. అవసరమైతే మరిన్ని నిధులు అందజేస్తామని వెల్లడించారు కొన్ని చోట్ల ఇబ్బందులు చేసినట్టు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వినాయక మంటపనిర్వాకులు విద్యుత్ అధికారులకు సహకరించాలని స్పష్టంచేశారు.