విపక్ష సభ్యులకు కంటి వెలుగు క్యాంపు చేపట్టాలి

శాసనభలో విపక్ష ఎమ్మెల్యేలపై జీవన్‌ రెడ్డి ఫైర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : రాష్ట్రంలోని విపక్ష ఎమ్మెల్యేలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సంక్షేమ పథకాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. విపక్ష సభ్యులకు చురకలంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు విపక్షాలకు కనబడుతలేవా? అని ప్రశ్నించారు. కళ్లున్న కబోదుల్లా బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కంటి వెలుగు క్యాంపు నిర్వహించాలని జీవన్‌ రెడ్డి ఎª`దదెవా చేశారు. అప్పుడైనా సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపిస్తాయన్నారు. ఆ తర్వాతనైనా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండే అవకాశం ఉంటుందని విపక్ష సభ్యులను ఉద్దేశించి
జీవన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయాలను సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంది. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కానీ కాంగ్రెస్‌ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందేవని జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు.