విలేకరుల శిక్షణ తరగతులు నిరసిస్తూ ధర్నా

కరీంనగర్‌, జూలై 27 : మెట్‌పల్లి పట్టణంలో గ్రామ ప్రాంత విలేకరులకు శుక్రవారం నాడు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎపియడబ్ల్యూజెకు తెలపకుండా నిర్వహించడం ఎంత వరకు సబబని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణ తరగతుల విషయం జిల్లాలోని విలేకరులకు సమాచారం అందించనందుకు నిరసనగా శుక్రవారం నాడు ధర్నా చేపట్టారు. విలేకరులు తెలపకుండా శిక్షణ తరగతులను నిర్వహించడం మంచిది కాదని వెంటనే వాటిని నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకొని కొందరు విలేకరులని అరెస్టు చేసి, అనంతరం విడుదల చేశారు.