*విశ్వకర్మలపై ఉక్కు పాదమా*
* విలేకరుల సమావేశం నిర్వహించిన తెలంగాణ విశ్వకర్మ సహకార సంఘం
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఆగస్టు 22 :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 69 కర్ర పని చేసుకుంటూ సహజీవనం కొనసాగించే విశ్వకర్మలకు పెనుభారంగా మారుతుందని తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సహకార సంఘం అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసచారి ధ్వజమెత్తారు రెక్కాడితే గాని డొక్కాడని విశ్వకర్మల స్థితిగతులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టిలో పెట్టుకొని జిఓ 69 నీ తక్షణమే రద్దుచేసి కులవృత్తినే నమ్ముకుని దుర్భరమైన జీవితాలను గడుపుతున్న విషయాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి షరతులు లేకుండా విశ్వకర్మలు స్వేచ్ఛాయుతంగా పనులు చేసుకొనుటకు అనుకూలత కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సహకార సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు