వీఆర్ఏలకు మద్దతు తెలిపిన వెంకట రమణారెడ్డి

జనంసాక్షి రాజంపేట్
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వీఆర్ఏ లు సంఘటితంగా ఉండి న్యాయమైన డిమాండ్ ల పరిష్కారం అయ్యే వరకు పోరాడాలని శుక్రవారం
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు.
న్యాయమైన డిమాండ్ ల పరిష్కారానికి గత 12 రోజులుగా రాజంపేట్ మండల కేంద్రంలోముందు వీఆర్ఏ లు తలపెట్టిన ధర్నా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….. కొట్లాడి సాధించుకున్న తెలంగాణా లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దిన దిన గండంగా ఉందని అన్నారు. ఆర్టీసీ కార్ర్మికులు నెలల తరబడి ధర్నా చేసినా కనికరించక చివరికి ఆర్టీసీ కార్మిక యూనియన్ల లో చీలిక తెచ్చి డిమాండ్ లు నెరవేర్చకుండానే ఉపసంహరణ చేసేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వం , ధరణి సమయంలో రాత్రి పగలు కష్ట పడ్డ వీఆర్వో వీఆర్ఏ ధరణి పని ఐపోగానే విభజించి మొదట వీఆర్వో లను రెవెన్యూ కి సబందం లేకుండా చేసి, తర్వాత వీఆర్ఏ లను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాదని అన్నారు.
ఉపాధి హామీ ఫీల్డ్ ఆసిస్టెంట్ ల విషయంలో కూడా ప్రభుత్వం రోజుకో మాట చెబుతూ విధుల్లో చేర్చుకోకుండా దాట వేస్తోందని అన్నారు
ఉద్యోగ భద్రత విషయంలో , మహిళలకు వెటర్నరీ సెలవుల విషయంలో ఇలా అన్ని రకాల వీఆర్ఏ డిమాండ్ లు పరిష్కారం కావలంటే ఏ డిమాండ్ ల కోసం అయితే ఉద్యమం ప్రారంభం చేశారో ఆ డిమాండ్ లు నెరవేరే వరకు సంఘటితంగా ఉండాలని అన్నారు.  ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగారెడ్డి,ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి,రాజేందర్ రావు,ప్రధాన కార్యదర్శి ఇట్ల శ్రీనివాస్,మండల యూత్ అధ్యక్షులు సంపత్ రెడ్డి, వివిధ గ్రామ అధ్యక్షులు గుర్రాల రాము,ఉపాధ్యక్షులు బాల్ నర్స్,కమ్మరి నాగరాజు, జై సాయి రెడ్డి,దుర్గాప్రసాద్,సంతోష్, రమేష్, ప్రసాద్ ,నరసింహులు మండల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు మరియు వీఆర్ఏల మండల అధ్యక్షుడు రవీందర్ ఉపాధ్యక్షులు గొల్ల భాస్కర్ ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు కోశాధికారి శ్రీకాంత్ నర్సింలు రాజు స్వామి
2 Attachments