వీహెచ్‌ మౌనవ్రతం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో మేథోమధనం చేయాలని డిమాండ్‌ చేస్తూ 28న ఉదయం 10:30 నుంచి గాంధీభవన్‌లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మౌనవ్రతం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ అవినీతి గురించి మంత్రుల కమిటీ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ కోవర్టని ప్రజలు అనుకుంటున్నారన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ కమిటీని విస్తరించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ బలోపేతానికి తమలాంటి సీనియర్ల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. పార్టీ కమిటీలో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కోరారు.