వేరుశెనగ విత్తనాల కోసం తోవులాట

దేవరుప్పల: మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల పర్మిట జారి రసాభాసగా మారింది మండలానికి 330బస్తాల వేరుశెనుగా విత్తనాలు రాగా ఉదయం నుంచి 1500 మంది రైతులు గుమికూడారు సరయిన నియంత్రణ లేక తోపులాట జరిగింది తోపులాటలో ధరావతు తండాకు చెందిన బానోతు శ్రీకన్య మెడలోనుంచి రెండు తులాల బంగారం గొలుసును చోరీ చేశారు దీంతో అధికారులు పర్మిట్ల విడుదలను నిలిపివేశారు అనంతరం రైతులు జనగామ సూర్యాపేట రహదారిపై కామారెడ్డి గూడెం స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్నారు