వైఎస్‌ విజయమ్మ రాజకీయా దండయాత్ర

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి మహిళ విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన పూర్తి రాజకీయా దండయాత్రేనని విమర్శించారు. సిరిసిల్లలో తెలంగాణ వాదులపై సీమాంధ్ర గూండాలు చేసిన దాడికి తగిన మూల్యం చెల్లుంచుకుంటారని వైఎస్‌ఆర్‌సీపీ కాలం చెల్లీందని ఆమె అన్నారు.