వైకుంఠధామం కు కనీస సౌకర్యాలు కల్పించాలి

రఘునాథ పాలెం ఫిబ్రవరి 27(జనం సాక్షి)
ఖమ్మం జిల్లా కలెక్టర్ కలిసి ప్రకాష్ నగర్ వైకుంఠధామంలో కనీస సౌకర్యాలు మరియ విద్యుత్ దీపాలు దహన సంస్కారం జరిగిన తర్వాత కాళ్లు చేతులు ముఖం శుభ్రపరచుకొనుటకు ఎలాంటి నీటి సౌకర్యం లేదని అలాగే ఆరు గంటల తర్వాత వైకుంఠధామానికి దహన సంస్కారులకై వెళ్లిన వారు అసౌకర్యానికి గురవుతున్నారని ఈ నివారణకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించినట్లయితే పోయినవారు తమ తమ కార్యక్రమాలను సులువుగా జరుపుకునే అవకాశం ఉంటుందని అలాగే 20 రోజుల క్రితం చెడిపోయిన విద్యుత్ మోటార్ ను తక్షణమే బాగు చేయించాలని కలెక్టర్ కి విన్నవించడం జరిగింది. ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంపద అధికారులకు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిసి ఎస్సి ఎస్టి మైనారిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు కన్వీనర్ గుంతేటి వీరభద్రయ్య కో కన్వీనర్స్ పెరుగు వెంకటరమణ బానోత్ బద్రి నాయక్ అబ్దుల్ రెహమాన్ నకరికండ సంజీవరావు మాల మహానాడు జిల్లా నాయకులు దాసరి శ్రీనివాసరావు కె రామారావు గాధర్ బాబు చింతపల్లి వెంకటేశ్వర్లు శ్రీమతి రమ్య శ్రీమతి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు