వైద్యారోగ్యశాఖలో కొలువుల జాతర

` 5348 పోస్టుల భర్తీకి పచ్చజెండా
` ఈనెల 16నే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని 5,348 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈమేరకు ఈనెల 16నే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు.ప్రజారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌, ఎంఎన్‌ జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేశారు. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించారు. ఇందుకోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, అర్హతకు సంబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేషన్‌ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు.