తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి

` కేంద్రానికి సూచించిన రాహుల్‌
` కొనసాగతున్న కాంగ్రెస్‌ అగ్రనేత జర్మనీ పర్యటన
` మ్యూనిచ్‌లో బిండబ్ల్యూ ప్లాంట్‌ సందర్శన
బెర్లిన్‌(జనంసాక్షి):జర్మనీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్‌ గాంధీ సందర్శించారు. అందులోని తాజా మోడల్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ బైక్‌లు.. ఎం సీరిస్‌, బీఎండబ్ల్యూ ఐఎస్‌3, రూల్స్‌ రాయిస్‌ తదితర వాహనాలను ఆయన పరిశీలించారు. అనంతరం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తయారీ రంగంపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో చిరు వ్యాపారులను పట్టించుకోవడం లేదంటూ కేంద్ర వైఖరిని తప్పుపట్టారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక వీడియోను పోస్ట్‌ చేసి ఆయన.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీఎస్‌ 450 సీసీ మోటర్‌ సైకిల్‌ను బీఎండబ్ల్యూ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇది భారతీయ ఇంజినీరింగ్‌ పనితనానికి గర్వకారణంగా ఉందన్నారు. తయారీ రంగం.. బలమైన ఆర్థికాభివృద్ధికి వెన్నుముక వంటిందని అభివర్ణించారు. కానీ విచారం ఏమింటే.. భారత్‌లో మాత్రం ఈ తయారీ రంగం అనేది తగ్గిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని వేగవంతం చేయాలంటే.. మనం మరిన్ని ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు.పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 15 నుంచి 20వ వరకు జర్మనీ రాజధాని బెర్లిన్‌ వేదికగా ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ జర్మనీ వెళ్లారు.ªూహుల్‌ చేస్తున్న ఈ పర్యటనపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. ఒక వైపు పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు జరుగుతుండగా.. ఆయన విదేశాలకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించింది. దేనికి ప్రాధాన్యత ఇవ్వల్లో రాహుల్‌కు తెలియదని ఆ పార్టీ అభిప్రాయపడిరది. అంతేకాదు.. లీడర్‌ ఆఫ్‌ పర్యటన్‌, లీడర్‌ ఆఫ్‌ పార్టీయింగ్‌ అని వ్యాఖ్యానించింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆయన పర్యటనపై బీజేపీ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలపై రాహుల్‌ సోదరి ప్రియాంకా గాంధీ కాస్తా ఘాటుగా స్పందించారు. అయితే 2005లో అప్పటి యూపీయే ప్రభుత్వం.. జాతీయ ఉపాధి హావిూ పథకం ప్రవేశ పెట్టింది. దీనికి జాతిపిత మహాత్మా గాంధీ పేరు పెట్టింది. తాజాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పేరును మార్చేసింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ చరిత్ర నుంచి గాంధీ, నెహ్రూల పాత్ర చెరిపిసే కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్‌ పార్టీ మండిపడిరది. నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇక పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు డిసెంబర్‌ 19వ తేదీతో ముగియనున్నాయి. ఈ సమావేశాల చివరి మూడు రోజులు సభ్యులంతా సభకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఆ పార్టీ విప్‌ జారీ చేసింది. మరి ఆ జాబితాలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేరు లేక పోవడం గమనార్హం.