శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి

` ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్‌, డిప్యూటి సిఎం
` 20,21 తేదీల్లో రెండ్రోజలు ఉపరాష్ట్రపతి పర్యటన
హైదరాబాద్‌(జనంసాక్షి):శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు డిసెంబర్‌ 17 నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హకీంపేట, అల్వాల్‌, బొలారం, తిరుమలగిరి, కార్కానా ప్రాంతాల్లో వాహనాల డైవర్షన్‌ కొనసాగుతుంది. రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు డ్రోన్లు, పారా గ్లైడర్స్‌, మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాప్ట్స్‌ ఎగురవేతపై నిషేధం. 18న సికింద్రాబాద్‌ లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిలిమ్‌ సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. పలు అభివృద్ది శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న రాష్ట్రపతి నిలయంలో ప్రముఖల కోసం ’ఎట్‌ హోమ్‌’, పౌరుల భేటీ లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరిగి ఢల్లీికి బయలుదేరుతారు.
20,21 తేదీల్లో రెండ్రోజలు ఉపరాష్ట్రపతి పర్యటన
భారత ఉప రాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌ లో ఈనెల 20 ,21 తేదీల్లో పర్యటించనున్నారు. డిసెంబర్‌ 20 వ తేదీన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకొని అక్కడ నుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి వెళ్తారు. పబ్లిక్‌ సర్వీస్‌ కవిూషన్‌ చైర్మన్‌ ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుండి లోక్‌ భవన్‌ లో రాత్రి బస చేస్తారు. 21 వ తేదీ ఉదయం కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ధ్యాన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకొని న్యూఢల్లీి తిరిగి వెళ్తారు. ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సంబంధిత ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సవిూక్షించారు. బందోబస్తు ఏర్పాట్లు, ఉప రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో రహదారుల నిర్వహణ, ప్రోటోకాల్‌ తదితర ఏర్పాట్లపై సవిూక్షించారు. ఉప రాష్ట్ర పతి పర్యటనకు ఏ విధమైన లోటు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.