ఆధార్‌ డేటా సేఫ్‌

` అత్యంత సురక్షితమని పార్లమెంటులో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా బేస్‌ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఆధార్‌ డేటా బదిలీ, స్టోరేజీ సమయంలో అధునాతన ఎన్‌క్రిప్షన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు మంత్రి వెల్లడిరచారు. నేషనల్‌ క్రిటికల్‌ ఇన్ఫర్మేషన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ప్రొటెక్షన్‌ సెంటర్‌ పర్యవేక్షణలో ఆధార్‌ వ్యవస్థ సురక్షితంగా ఉందని తెలిపారు. అధునాతన భద్రతా చర్యల కారణంగా పౌరుల ఆధార్‌ డేటా సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడిరచింది. ఈ మేరకు కేంద్ర ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థ అయిన ఉడాయ్‌లో సుమారు 134 కోట్ల మంది ఆధార్‌ హోల్డర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 16వేల కోట్ల అథంటేకేషన్‌ లావాదేవీలు జరిగాయని కేంద్రమంత్రి తన సమాధానంలో వెల్లడిరచారు. బలమైన సాంకేతిక, సంస్థాగత భద్రతా చర్యల కారణంగా ఆధార్‌ డేటా సురక్షితంగా ఉందని తెలిపారు. ఆధార్‌ డేటా భద్రతకు ఉడాయ్‌.. డిఫెన్స్‌` ఇన్‌` డెప్త్‌ విధానాన్ని అనుసరిస్తూ బహుళ అంచెల భద్రతా వ్యవస్థను అమలు
చేస్తోందన్నారు. ఇందులో ఒక లేయర్‌ దెబ్బతిన్నా.. మిగిలినవి డేటాకు రక్షణ కల్పిస్తాయని చెప్పారు. ఇది ఎప్పటికప్పుడు ఆధార్‌ సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి సూచనలు చేస్తుంటుందని పేర్కొన్నారు. దీనికితోడు స్వతంత్ర ఆడిట్‌ ఏజెన్సీలు కూడా ఆధార్‌ ఎకోసిస్టమ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.