తెలంగాణలో మరో కొత్త డిస్కం
` ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్(జనంసాక్షి):విద్యుత్‌శాఖలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల నిర్వహణ, అలాగే ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని సంస్కరించడం ఈ డిస్కం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఉన్న తెలంగాణ సదరన్, నార్తర్న్ డిస్కమ్‌లతో పాటు ఈ కొత్త డిస్కం పనిచేయనుంది. దీనివల్ల విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వం, సంక్షేమ పథకాల అమలును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త డిస్కమ్ ఏర్పాటుపై గతంలోనే కేబినేట్‌లో నిర్ణయించారు. దీనిద్వారా విద్యుత్ వినియోగాన్ని లెక్క కట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


