వైద్యావిదానంలో మార్పులు :ముఖ్యమంత్రి
హైదరాబాద్ : తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్‌లో ట్రామ్‌కేర్ విభాగన్ని శనివారం ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 176 కోట్లు వెచ్చించి భవానాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా చేసే శస్త్రచికిత్సలు, ఇతర వైద్యంలో 40శాతం వాటా ప్రభుత్వాసుసత్రులకు మళ్లిస్తామన్నారు. మూడు జిల్లాలో ప్రయోగత్మకంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌ను ఆన్‌లైన్ ద్వారా అనుసందానిస్తామని తెలిపారు. 108కు ట్రాకింగ్ సిస్టమ్స్‌ను ఏర్సాటు చేస్తామన్నారు. వైద్యావిద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ నిమ్స్‌లో ఎర్పాటు చేసిన అత్యవసర విభాగం ద్వారా 500 పడకలు, 14 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, పార్థసారధి, తదితరులు పాల్గొన్నారు.