వైద్య బీమా పాలసీ కి గడువు పెంపు

హైదరాబాద్‌ : జర్నలిస్టుల వైద్యబీమా పాలసీకి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేది మంగళవారం వరకు పొడిగించారు. ఈ విషయాన్ని హెచ్‌యూజే అధ్యక్షులు ఖలీద్‌ఖాద్రి, కార్యదర్శి టి.కోటిరెడ్డి తెలిపారు. రెన్యూవల్‌ చేసుకునే వారు పాత పాలసీ కార్డు జిరాక్స్‌ కాపీ, కొత్తగా దరఖాస్తు చేసే జర్నలిస్టులు కుటుంబసభ్యుల రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఏపీయూడబ్య్లూజే హైదరాబాద్‌ పేరిట రూ.900 బ్యాంకు డీడీని దరఖాస్తుకు జతచేసీ బషీర్‌బాగ్‌ దేశోద్దారక భవనం లోని యూనియన్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.