– వైభవంగా కుంకుమ పూజలు

share on facebook
చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్ట్ 04)  : చండ్రుగొండలో జరిగే సాయిబాబా మహాలక్ష్మి అమ్మవార్ల  విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం  సందర్భంగా  చండ్రుగొండలో ఆధ్యాత్మికత  సంతరించుకుంది. 5  రోజుల ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 3రోజు  శుక్రవారం కుంకుమపూజలు వైభవంగా నిర్వహించారు  ఈ కార్యక్రమంలో  గ్రామంలోని మహిళలు  వందలాది మంది పాల్గొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు పూజా కార్యక్రమాలకు లడ్డూలను  వేద పండితులకు అందజేశారు. అనంతరం  విగ్రహ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ   ప్రత్యేక వాహనాలలో ఊరేగింపు చేసారు. ఈ కార్యక్రమాలను  ఆలయ కార్యనిర్వహణ కమిటీ  పర్యవేక్షించింది.

Other News

Comments are closed.