వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్ధంతి
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
స్వాతంత్ర్య సమరయోధుడు యువత కు ఆదర్శం షహీద్ భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు ఆమెర్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రం లోని బాబు జగజ్జీవన్ రావ్ చౌరస్తా వద్ద భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పార్టీ జిల్లా అధ్యక్షులు అతహర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పట్టణ యూత్ అధ్యక్షులు ఆమెర్ మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ధైర్యసాహసాలు భావితరాల యువత కు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో యువతను మేల్కొల్పడానికి ఢిల్లీ గల్లీ లో ఎర్ర రంగు పేపర్ లను వెదజల్లి ఉద్యమానిక ఊతం పోసిన యువ ఉద్యమ కారుడు భగత్ సింగ్ అని 23 ఏళ్ల అతి చిన్న వయస్సు లో దేశం కోసం ఉరి ఖంభం ఎక్కిన మహానుభావుడని అన్నారు.అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు సుఖ్ దేవ్, రాజ్ గురు, భగత్ సింగ్ లు అమరులయిన రోజు అని ఈరోజు వారి బలిదానాలను స్మరించుకుంటూ, వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పాటు పడాలని యువత కు పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా అధ్యక్షులు అతహర్ మాట్లాడుతూ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారికి నిద్ర లేకుండా చేసిన యువ వీర కిశోరాలు సుఖదేవ్, భగత్ సింగ్ మరియు రాజ్ గురు అని “ఇన్కలాబ్ జిందాబాద్” అనే నినాదాలు చేస్తూ ఉరి ఖంబాన్ని ముద్దాడిని మహనీయులని కొనియాడారు. “మేరా రంగ్ దే బసంతీ చోలా” అంటూ తమ రక్తం తో హోలీ జరిపిన ఈ భారత దేశ ముద్దు బిడ్డలను మరువకూడదని అన్నారు.ఇలాంటి గొప్ప వ్యక్తుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరపాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షకీల్, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు రమేష్, పట్టణ మైనారిటీ అధ్యక్షులు వాహెద్, పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, యూత్ కార్యదర్శి రాకేష్,మండల అధ్యక్షులు శ్రీనివాస్,యూత్ నాయకులు రేవంత్, పృథ్విరాజ్, నేహాల్, నవీన్, లతీఫ్,దిలీప్, గని, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్ధంతి………………..