శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు
విమానాశ్రయంలో బంగారం, విదేశీ సిగరెట్లు సీజ్
ముగ్గురు అరెస్ట్,64.30 లక్షల విలువచేసే 1.099 కిలోల బంగారం,11.06 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు స్వాధీనం
రాజేంద్రనగర్. ఆర్.సి.అక్టోబర్ 10 (జనం సాక్షి) గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని సిగరెట్లు తరలిస్తున్న ముగ్గురు ముఠాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్న ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మస్కట్, బహరైన్ నుండి విమానంలో హైదరాబాద్ రావడానికి వచ్చి శంషాబాద్ విమానాశ్రయం లోకి దిగడంతో ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులకు ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా వారి వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికులలో ఒక ప్రశ్నకు బంగారాన్ని పేస్ట్ గా మార్చి నాలుగు క్యాప్షన్స్ లో అమర్చి శరీర భాగంలో పెట్టుకుని వచ్చాడు. మరో ప్రయాణికుడు బంగారాన్ని రెండు ముక్కలుగా మరియు ఒక ఆభరణంగా చేసుకొని లగేజ్ బ్యాగులు దాచిపెట్టి వస్తున్న గా కస్టమ్స్ అధికారులు బంగారాన్ని గుర్తించి వారిద్దరి నుండి 64.30 లక్షల విలువచేసే 1.099 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరో ప్రయాణికుడు కాంబోడియా నుండి వచ్చిన ప్రయాణికుడు తన లగేజ్ బ్యాగులు విదేశీ సిగరెట్లను అక్రమంగా అమర్చుకొని వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి అతని వద్ద నుండి 11.06 లక్షల విలువ చేసే 1.17,600 స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం.
ఫోటో రైటప్ : శంషాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న విదేశీ సిగరెట్లు.