శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ తోలిరోజు ఎలాంటి చర్చ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది ఈ ఉదయం సమావేశాలుప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులుసభను అడ్డుకున్నారు దీంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 45 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి పదిగంటలకు ప్రారంభంకాగానే తెలంగాణపై తీర్మానం చేయలంటూ తెరాస సీపీఐ నేతలు స్పీకర్‌ పోడీయంను చుట్టుముట్టారు.విద్యుత్‌ కోతలపై స్వల్పకాలిక చర్చ చేపడుతామని స్పీకర్‌ సూచించినప్పటికి సభ్యులు శాంతించలేదు దీంతో సభను రెండోసారి స్పీకర్‌ వాయిదా వేశారు. అరగంట వాయిదా వేశారు. తరువాత సభ ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం. కోసం తెరాస అందోళన కోనసాగించడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదావేశారు.