శిశువులకు అంగన్వాడీ కేంద్రాలు సురక్షితం

నాగర్ కర్నూల్ మార్చి 16(జనంసాక్షి):అంగన్వాడి కేంద్రంలో చక్కటి పోషకాహారం ఇస్తున్నామని,గర్భిణీ స్త్రీలకు రోజు భోజనాలు గుడ్డుతో పాటు పోషకాహారం అందిస్తున్నామని అంగన్వాడి జిల్లా డి.డబ్ల్యూ వెంకటలక్ష్మి అన్నారు.తాడూరు మండలం అల్లాపూర్ అంగన్వాడి సెంటర్ సెక్టార్ మీటింగ్ లో మాట్లాడుతూ,జిల్లాలు అంగన్వాడి సెంటర్లు చక్కగా నడుస్తున్నాయని,పిల్లలను ఆటపాటలతో అలరిస్తున్నారని,సెంటర్లో పిల్లలకు మంచి పోషకాహారం అందిస్తున్నామని అన్నారు.ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి పిల్లలని అంగన్వాడి సెంటర్లకు తీసుకరావాలని,అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు చక్కటి ఆట వస్తువులు ఏర్పాటు చేశామని,భోజనానికి సంబంధించిన కూరగాయలు కూడా అంగన్వాడి కేంద్రాలులో గార్డింగ్ చేసి పండిస్తున్నామని,గ్రామానికి మంచి ఆదర్శ సెంటర్ గా అంగన్వాడీలు నడుస్తున్నాయని ఆమె అన్నారు.ఆన్లైన్ అయినందున టీచర్లు,ఆయాలు సమయపాలన పాటించాలని,వేసవి కాలం కావడంతో పిల్లలపై తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె అన్నారు.అల్లాపూర్ గ్రామంలో అన్వాడి సెంటర్ మోడల్ సెంటర్ గా తయారు చేయడంలో గ్రామ సర్పంచు,గ్రామస్తులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని అదేవిధంగా వివిధ గ్రామాలలో కూడా ప్రజల భాగస్వామ్యులు కావడానికి ముందుకు రావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జివి.రామకృష్ణ,సిడిపిఓ సంగీత,సూపర్వైజర్ వనజ,అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.