శ్రీరామకృష్ణ వివేకానంద బావ ప్రచార పరిషత్ రాష్ట్ర కన్వీనర్ గా ఎన్ సూర్య ప్రకాష్.
రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధమయానంద్ మహారాజ్ సమక్షంలో నియామకం.
తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రస్తుత రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు ఎన్ సూర్య ప్రకాష్ మిత్ర బృందం కలిసి2000 సంవత్సరంలో తాండూరు లో రామకృష్ణ సేవా సమితి ప్రారంభించారు. అప్పటినుండి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ గిరిజన ప్రాంతంలో మెడికల్ నేత్ర క్యాంపులు నిర్వహించి ఎందరికో సేవ చేశారు.ఎస్ఎస్సి విద్యార్థులకు మంచి రిజల్ట్ కోసం ట్యూషన్లు పెట్టించారు. తాండూర్ పట్టణం లో ఇంటర్ విద్యార్థులకు ఇంపాక్ట్ మోటివేషన్ ఇచ్చారు.తాండూర్ రామకృష్ణ సేవ సమితి జాయింట్ కన్వీనర్ గా సేవలందిస్తూ రామకృష్ణ మఠం హైదరాబాదులో రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ కన్వీనర్ గా సేవలందిస్తున్న సూర్య ప్రకాష్ కు ఆయన సేవలను గుర్తించి అధ్యక్షులు బోధ మయానంద్ మహ రాజు సమక్షంలో రామకృష్ణ వివేకానంద బావ ప్రచార పరిషత్ రాష్ట్ర కన్వీనర్ గా నియామకం కావటం పట్ల శ్రీరామకృష్ణ సేవా సమితి తాండూర్ మిత్రబృందం స్నేహితులు
తాండూరు నియోజకవర్గ ప్రజల హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Attachments area