శ్రీ వేద హైస్కూల్లో ఉచిత దంత,కంటి వైద్య శిబిరం.

 

కోటగిరి మార్చి 17 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద హై స్కూల్లో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో ఉచిత దంత,కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బోధన్ హోప్ వెల్ డెంటల్ ఆస్పత్రి వైద్యులు డా.ఇర్ఫాన్ అలీ ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేస్తూ ఉచితంగా పేస్టులు,మౌత్ క్లీనర్స్ లను అందించారు.అదేవిధంగా బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డా.సతీష్ కుమార్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేస్తూ ఉచిత ఐస్ డ్రాప్స్ మందులను అందజేశారు.ఈ శిబిరంలో 400 మంది విద్యార్థులకు దంత,కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు.విద్యార్థులకు విద్యార్థి దశ నుండే వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఈ ఉచిత వైద్య శిబి రాన్ని నిర్వహించామని పలువురు పేర్కొన్నారు. అనంతరం డా.ఇర్ఫాన్ అలీ,డా.సతీష్ కుమార్, లయన్ క్లబ్ శ్యాంసుందర్ పరుడే లను పాఠశాల యాజమాన్యం శాలువతో ఘనంగా సత్కరించారు.ఈ వైద్య శిబిరంలో సమీర్ ఖానం,వసంత,యాదవ్, బుష్రా,షబ్నం,లయన్ శ్యాంసుందర్ పరుడే,హను మంత్ రావు,పాఠశాల కరస్పాండెంట్ తేల్ల రవి, ప్రిన్సిపాల్ తేల్ల అక్షర,సిబ్బంది జగదీష్,సాయి పవన్, సాయిరాం,బీం రావు, మానస,అశ్విణి,రేష్మ,చంద్రకళ గౌతమి,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.