శ్రీ షిర్డీసాయిబాబా మందిరాలలో ప్రత్యేక పూజలు
– అభిషేకాలు, అన్నదానాలలో పాల్గొన్న భక్తులు
అశ్వారావుపేట, సెప్టెంబర్ 8( జనం సాక్షి )
అశ్వారావుపేట మండలంలోని షిర్డీ సాయిబాబా మం దిరాలలో గురువారం పురష్కరిం చుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వినాయ కపురం గ్రామంలో ఉన్న షిర్డీసా యిబాబా మందిరంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్న శ్రీ జ్ఞానసాయి మందిరంలో కొలువుదీరిన సాయినాథునికి మందిరపూజారి శుభం దీక్షిత్ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటలకు బాబా మేలుకొలుపుతో ప్రారంభమైన పూజలు 5 గంటల 15 నిమిషాలకు కాకడ హారతి 6 గంటలకు బాబాకు పంచామృత అభిషేకాలు నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం అష్టోత్తరం జరిపి భక్తులకు దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్న హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి 7 గంటలకు పల్లకిసేవ చేసి, 8:30గంటలకు బాబా పవళింపు సేవను(శేజ్ హారతి) కొనసాగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిర్డీసాయి సేవ సమితి సభ్యులు, పంబిహరి, మంగదొడ్డి మురళి, కేతరాజు,వీరయ్యచౌదరి, పృధ్వీ, చందు, సాయి, గౌరీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.