షాదీఖానా ఆక్రమాణపై దర్యాప్తు చేయాలి

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌
శ్రీకాకుళం, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం పేద, మద్యతరగతి ముస్లింల సంక్షేమం కోసం పదేళ్ల క్రితం నిర్మంచిన షాదీఖానా ఆక్రమణకు గురైందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ముస్తాక్‌ మహ్మద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షాదీఖానాను ఒక వ్యక్తి తన సొంత ఆస్తిలా ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు. జామియా మసీదు ఆస్తులు ముగ్గురు వ్యక్తుల వ్యక్తిగత ఆస్తులుగా మారాయన్నారు. వారికి ఇష్టమెచ్చినట్లు అద్దెకు ఇవ్వడం, కొన్ని దుకాణాలు విక్రయించడం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. అన్యాక్రాంతమైన ఆస్తులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆక్రమణదారుల నుంచి రక్షించాలని కోరారు.