షిండే ప్రకటనతో సంబంధం లేదు

మార్చ్‌ కొనసాగుతుంది
జేఏసీ చైర్మన్‌ కోదండరాం

తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. షిండే ప్రకటన విధానపరమైన ప్రకటన కాదని ఆయన అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ బలమైన శక్తులు తెలంగాణను అడ్డుకుంటున్నాయని, పెద్ద స్థాయిలో ఒత్తిడి తేవాలని కోదండరాం అన్నారు. పొలిటికల్‌ జేఏసీ అదేపనిలో ఉందని ఆయన పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో గవర్నర్‌ ను కలిసి తెలంగాణ మార్చ్‌పై సమాచారం ఇస్తామని చెప్పారు. తెలంగాణ మార్చ్‌ కార్యా చరణపై అస్పష్టంగా లేమని, త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. అన్ని ప్రజాసంఘా లను, విద్యార్థి నంఘాలను కలసి, తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో సన్నాహ కమిటీలను ఏర్పాటు చేసినట్లు కోదండరాం చెప్పారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ శ్రేణులన్ని కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌ విజయవంతానికి ఉద్యోగులు, విద్యార్ధులు, కళాకా రులు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారని కోదండరాం చెప్పారు. తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హావిూలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) :