పుతిన్‌పై సైనికచర్య ఉండదు
` ఆయన నాకు మంచి మిత్రుడు
` ఎన్నో ఏళ్లుగా మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి
` కానీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎంతో అమాయకులు చనిపోతున్నారు
` ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపేశా: ట్రంప్
వాషింగ్టన్(జనంసాక్షి):వెనెజువెలా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం ఆకస్మికంగా బంధించిన ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ పరిణామం తర్వాత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కూడా అమెరికా ఇలాంటి సైనిక చర్య చేపడుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇటీవల డొనాల్డ్? ట్రంప్‌తో జరిగిన విూడియా సమావేశంలో యూఎస్ విూడియా ప్రతినిధులు కీలక ప్రశ్నలు సంధించారు. మదురో మాదిరిగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా భవిష్యత్తులో బంధించేందుకు అమెరికా సైనిక చర్యలకు దిగుతుందా? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ, ఎన్నో ఏళ్లుగా తనకు పుతిన్‌తో మంచి పరిచయం, స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
ఎనిమిది యుద్ధాలను ఆపేశా
అయితే ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం విషయంలో పుతిన్ వైఖరిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ యుద్ధం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ పరిస్థితి నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది’’ అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ మరోసారి గుర్తు చేశారు.
ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూనే!
అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాత్రం ఇప్పటివరకు విజయం సాధించలేకపోతున్నానని చెప్పారు. ‘‘ఈ యుద్ధాన్ని ఆపడం చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ దీన్ని ముగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై సైనిక చర్యలు చేపడతారా అనే ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
పుతిన్‌ను బంధించేందుకు లేదా రష్యాపై సైనిక చర్యలకు దిగే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దిశగా రష్యాపై రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్థించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నియంతలను ఇలాగే ఎదుర్కోవడం సాధ్యమైతే, అలాంటి వారి విషయంలో ఏం చేయాలో అమెరికాకు బాగా తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ వ్యాఖ్యలు పుతిన్‌ను ఉద్దేశించి చేసినవేనని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడుల పరంపరను కొనసాగిస్తున్న పుతిన్‌ను కూడా ట్రంప్ ఇదే తరహాలో హ్యాండిల్ చేయాలని ఆయన సూచించినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర అసంతృప్తి
ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో స్నేహం ఉందని చెబుతూనే, మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే సైనిక చర్యలు కాకుండా, దౌత్య మార్గాల్లోనే రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురో అరెస్టు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపగా, పుతిన్‌పై కూడా ఇలాంటి చర్యలు ఉంటాయా అనే ప్రశ్నలకు ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన సమాధానం స్పష్టతనిచ్చినట్లైంది. ఉక్రెయిన్?త` రష్యా యుద్ధం ముగింపే తన లక్ష్యమని, అయితే దానికోసం సైనిక మార్గాన్ని ఎంచుకోనని ట్రంప్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చేసుకునితీరతాం
` మరోసారి ట్రంప్ హెచ్చరిక
` మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు
` గ్రీన్‌లాండ్ రాజకీయ పార్టీల ప్రకటన
వాషింగ్టన్(జనంసాక్షి):అక్కడి ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా.. గ్రీన్‌లాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనా అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.చర్చల ద్వారా గ్రీన్‌లాండ్‌ను పొందాలని అనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. కాబట్టే కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. గ్రీన్‌లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయి. అమెరికా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేస్తాయి. అందువల్లే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి కఠిన మార్గాలను ఎంచుకోవడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. అమెరికాకు గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా కీలకమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరం. దీనిపై మరింత లోతుగా చర్చలు జరపడానికి గ్రీన్‌లాండ్, డెన్మార్క్ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటి అవుతారు’ అని ట్రంప్ వైట్‌హాస్‌లో విూడియా ముందు వ్యాఖ్యానించారు.
మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత గ్రీన్‌లాండ్ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దానిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమనుకుంటే సైనిక ఆప్షన్‌ను పరిశీలిస్తామని ఆయన యంత్రాంగం ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్ రాజకీయపార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. తాము అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదని, తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం తమ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశాయి. దానికి సంబంధించిన ప్రకటనపై ఆ పార్టీల నేతలు సంతకాలు చేశారు. గ్రీన్‌లాండ్ భవిష్యత్తును ఈ ద్వీప ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడిరచారు. గ్రీన్‌లాండ్ గురించి ఇంకో 20 రోజుల్లో మాట్లాడదామంటూ ఒకసారి.. అక్కడి ప్రజలు ఇష్టపడినా, పడకపోయినా ఆ ద్వీపం విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని మరోసారి.. ట్రంప్ ఇలా వరుసగా హెచ్చరికలు చేస్తున్నారు. గ్రీన్‌లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయని.. అమెరికా దానిని స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేస్తాయని ఆయన (ఆనీనిజీశ్రీట ుతీబీఎజూ) పేర్కొన్నారు. అందువల్లే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి కఠిన మార్గాలు ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపులను గ్రీన్‌లాండ్‌తో పాటు డెన్మార్క్ తిప్పికొడుతోంది. డెన్మార్క్‌తోపాటు మరో రెండు స్వయం ప్రతిపత్తి ప్రాంతాలైన గ్రీన్‌లాండ్, ఫారోదీవుల్ని కలిపి ‘డెన్మార్క్ లేదా డానిష్ కింగ్‌డమ్’గా పిలుస్తారు.



