రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకే ‘అరైవ్ అలైవ్’
` ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : డిజిపి బి. శివధర్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను గణనీయంగా తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 12 వ తేదీన యూసుఫ్‌గూడాలోని ఇండోర్ స్టేడియంలో పాల్గొననున్నారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రచారం జనవరి 13 నుంచి 24 వరకు, పండుగ సెలవులు మినహా పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు డిజిపి వెల్లడిరచారు.ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను గణనీయంగా తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని డిజిపి తెలిపారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మనసులో బలంగా నాటిపోవాలన్నదే ‘అరైవ్ అలైవ్’ ఆశయమని చెప్పారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి సీనియర్ అధికారుల నుంచి చివరి స్థాయి పోలీసు సిబ్బంది వరకు అందరూ పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.ఈ ప్రచారం ద్వారా ప్రజల్లో ప్రవర్తనా మార్పు తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని సంస్థాగతంగా నెలకొల్పడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని డిజిపి పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు, విూడియా, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖలు, న్యాయవ్యవస్థల భాగస్వామ్యంతో తెలంగాణను దేశానికి ఆదర్శ రోడ్డు భద్రతా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.హెల్మెట్ ధరించకపోవడం, ముఖ్యంగా పిల్లియన్ రైడర్లు కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం, ముందు?వెనుక సీట్లలో సీటుబెల్ట్ వినియోగం లేకపోవడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోలు ఓవర్‌లోడిరగ్, విూటర్?యూనిఫాం నిబంధనలు ఉల్లంఘించడం, హైబీమ్ లైట్లు, ఎడమవైపు నుంచి ఓవర్‌టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ఈ ప్రచారంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నామని డిజిపి స్పష్టం చేశారు.జిల్లా స్థాయిలో పోలీస్ కమిషనర్ లేదా జిల్లా ఎస్పీ నేతృత్వంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారుల సహకారంతో ఈ ప్రచారం అమలవుతుందని, డివిజన్ స్థాయిలో ఎస్డీపీఓలు, మండల స్థాయిలో సీఐలు, ఎస్సైలు, గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ ట్రాఫిక్ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, యువత, ఎన్‌సీసీ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు తదితరులను ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేస్తామని చెప్పారు.ఈ పది రోజుల ప్రచారంలో డిఫెన్సివ్ డ్రైవింగ్, విద్యార్థులు?యువత, గ్రావిూణ రోడ్డు భద్రత, మహిళలు?కుటుంబ భద్రత, మద్యం సేవించి వాహనం నడపేవారిపై జీరో టాలరెన్స్, సెలబ్రిటీలు?విూడియా, కార్పొరేట్?రవాణా రంగం, స్వచ్చంద సంస్థలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని డిజిపి తెలియజేశారు.ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని డిజిపి తెలియజేశారు. గ్రామ సభలు, విద్యాసంస్థలు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబ్ సేవలు, కైట్ ఫెస్టివల్స్, రంగోలీలు, రోడ్ క్యాంపెయిన్లు, బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక చర్యలు, మాల్స్, మార్కెట్లు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, కంపెనీలు, కర్మాగారాలు, మత సంస్థలు, ఎస్‌ఈఆర్‌పీ, ఎంఈపీఎంఏ గ్రూపులతో కలిసి విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు.ఈ ‘అరైవ్ అలైవ్’ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతిగా, పూర్తి స్థాయిలో అమలు చేయాలని పోలీస్ కమిషనర్లను, ఎస్పీలను ఆదేశించినట్లు డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి వెల్లడిరచారు. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టి, తెలంగాణను రోడ్డు భద్రతలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయాలని డిజిపి పిలుపునిచ్చారు.


