లోయలో పడ్డ బస్సు..
` 8మంది దుర్మరణం
` హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సిమ్లా(జనంసాక్షి):హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 8 మంది ప్రయాణికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కుప్వి నుంచి సిమ్లాకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం హరిపుర్దార్ ఏరియాలోని ఇరుకైన రహదారిపై వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడిరది. సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు సిర్మూర్ ఎస్పీ నిశ్చింత్ సింగ్ నెగి తెలిపారు. తొలుత ప్రమాద స్థలికి చేరుకున్న స్థానికులు అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకోకముందే సహాయక చర్యలు చేపట్టారు. పలువురు క్షతగాత్రులను సవిూప ఆసుపత్రులకు తరలించారు. మరికొందరికి సీరియస్‌గా ఉండటంతో హెయర్ మెడికల్ సెంటర్లకు తరలిస్తున్నట్టు నిశ్చింత్ సింగ్ చెప్పారు. ªూగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

