ఘనంగా జననేత జన్మదిన వేడుక

పాపన్నపేట, జనవరి 10 (జనంసాక్షి) :పాపన్నపేట మండల కేంద్రంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు 60 వ జన్మదిన వేడుకను హస్తం శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వనదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈసందర్బంగా పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖలీమ్ మియా,నాయకులు దోసని సంగమేశ్వర్,కిష్టయ్య,ఇబ్రహీం,సుంకరి శివయ్య,ప్రవీణ్ గౌడ్, ప్రసాద్ గౌడ్,శ్రీను తదితరులు ఉన్నారు.



